స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -551 లో....రాజ్ హాల్లోకి వస్తాడు. అందరు ఇప్పుడు నన్ను ఆఫీస్ కి వెళ్ళమని బ్రతిమిలాడుతారని అనుకుంటాడు. కానీ ఆవిషయం పక్కన పెట్టి ఖాళీగా ఉంటున్నావ్ కదా.. ఆ పని చెయ్.. ఈ పని చెయ్ అంటారు. ఇందిరాదేవి ఏకంగా కూరగాయలు తీసుకొని రమ్మని చెప్తుంది. రాజ్ తీసుకొని వస్తానని అనగానే అందరు షాక్ అవుతారు. దాంతో ఇందిరాదేవి లిస్ట్ ఇస్తుంది. అది తీసుకొని వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అపర్ణ, కనకం ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు. మీ అల్లుడు బయలుదేరాడని ఇందిరాదేవి చెప్తుంది. మరొక వైపు కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ మేనేజర్ నుండి సెక్యూరిటీ షిఫ్ట్ చేసిన అతను కావ్యకి నమస్తే పెడతాడు. నీకు సెల్యూట్ ఎలా చేయాలో కూడా తెలియదా అని కావ్య అనగానే.. నేను ఏమైనా పుట్టుకతో సెక్యూరిటీనా అని అతను అంటాడు. ముందు సెక్యూరిటీ డ్యూటీ నేర్చుకోమని కావ్య కోప్పడి వెళ్ళిపోతుంది. కావ్య లోపలికి వెళ్లేసరికి.. శృతి ఇంకొక అమ్మాయి ఇద్దరు కూడా రాజ్ సర్ వస్తాడని ఒకరు.. కావ్య మేడమ్ వస్తారని ఒకరు పందెం కాస్తుంటారు. కావ్య వచ్చి వాళ్లపై కోప్పడుతుంది. ఆ తర్వాత అపర్ణకి కావ్య ఫోన్ చేసి మాట్లాడుతుంది. మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ మీ అబ్బాయి ఎంత బాధపడుతున్నాడోనని కావ్య అనగానే.. అదేం లేదని అపర్ణ అంటుంది.
మరొకవైపు రాజ్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు ఎక్కువ ధరకి కొంటాడు. అదంతా చూసిన కనకం.. నా అల్లుడుని మోసం చేస్తున్నావంటూ అడుగుతుంది. అయిన మీరు చేసిన మోసం ముందు ఇది ఎంత అన్నట్లు రాజ్ మాట్లాడతాడు. మిమ్మల్ని ఎప్పటికి క్షమించలేనని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య దగ్గరికి శృతి వచ్చి.. క్లయింట్స్ రానని చెప్పారని అంటుంది. అప్పుడే అనామిక ఫోన్ చేసి.. వాళ్ళని నేనే రాకుండా ఆపానని అంటుంది. తరువాయి భాగ లో రాజ్ ని ఆఫీస్ కి వెళ్ళమని అందరు ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటే.. రాజ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.